బాలికల హాస్టల్ వార్డెన్ విద్యార్థినుల ప్రైవేటు వీడియోలు, ఫొటోలు తీసి ఇతరులకు పంపిస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ విద్యార్థులు తరగతులను బహిష్కరించి కళాశాల ముందు ధర్నా చేశారు. రంగారెడ్డి జిల్లా, ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి అవుషాపూర్‌లోని ఈ కళాశాలలో బాలికల హాస్టల్ వార్డ్డెన్ రూప గత కొన్ని రోజులుగా విద్యార్థినుల ప్రైవేటు వీడియోలు, ఫొటోలు తీసి బాలుర చీఫ్ వార్డెన్ సత్యనారాయణకు పంపిస్తున్నట్లు కొందరు విద్యార్థులు గుర్తించారు. ఇందుకు బాధ్యులైన వారిని వెంటనే సస్పెండ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తరగతులు బహిష్కరించి కళాశాల ముందు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగిన విద్యార్థులకు నచ్చజెప్పినా వినకపోవడంతో స్పందించిన కళాశాల యాజమాన్యం ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో ధర్నాను విరమించారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
విద్యార్థినుల ప్రైవేటు వీడియోలు, ఫొటోలు బహిర్గతం
- Advertisement -
- Advertisement -
- Advertisement -