రజతోత్సవ సభకు
ముస్తాబైన వరంగల్
జిల్లా ఎల్కతుర్తి సభా
స్థలిలో భారీ ఏర్పాట్లు
800 ఎకరాల్లో పార్కింగ్
1200 టాయిలెట్లు,
12 వైద్య శిబిరాలు
మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: వరంగల్ జి ల్లా ఎలతుర్తి మండల కేంద్రంలో ఈనెల 27న ని ర్వహించనున్న బిఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. రజతోత్సవ సభ సందర్భంగా వరంగల్ మహానగరం నలు దిశల్లో గులా బీ రంగుతో ముస్తాబవుతున్నది. బిఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 25 సంవత్సరాల రజతోత్సవ సభను పండుగ కార్యక్రమంగా ఘనంగా నిర్వహించేందుకు పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు అహర్నిశలు కృషి చేస్తున్నారు. 1,200 ఎ కరాల్లో సభా సభ వేదికను ఏర్పాటు చేశారు. సభ వేదికపై 500 మంది కూర్చునేవిధంగా వేదికను సిద్ధం చేశారు. విఐపి గ్యాలరీకి లక్ష కుర్చీలను ఏ ర్పాటు చేశారు. సభకు 15 లక్షల మంది ప్రజలు హాజరయ్యేందుకు అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుం డి భారీ ఎత్తున సభకు ఆహ్వానించేందుకు ఇప్పటి కే ముమ్మర ప్రచారం చేపట్టి ఇన్‌ఛార్జీలను నియమించి సభకు వచ్చేందుకు కావాల్సిన రవాణా ఏ ర్పాట్లు పూర్తి చేశారు. సభ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ బహిరంగ సభలో సభా వేదికకు 300 ఎకరాలు, సభాస్థలికి 900 ఎకరాలు పార్కింగ్‌కు 800 ఎకరాల స్థలాలు కేటాయించి, అందుకు సంబంధించిన ఏర్పాటు పూర్తి చేశారు. వచ్చిన విఐపిలతోపాటు ప్రజలకు గ్యాలరీల వారీగా కు ర్చీలను ఏర్పాటు చేస్తున్నారు.
మహిళలకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రజలకు ఎండ తీవ్రత తగలకూడదనే ఉద్దేశంతో కూలర్లు, వాటర్ ప్యాకెట్లు , మజ్జిగ ప్యాకెట్లను ఏర్పాటు చేశారు. పది లక్షల మందికి తాగు నీటితోపాటు మజ్జిగ ప్యాకెట్లను ఇప్పటికే ఆర్డర్ చేశారు. సభను సజావుగా నిర్వహించేందుకు 2,000 మంది వ లంటీర్లను నియమించనున్నారు. సభకు వచ్చే వా హనాలకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా వాలంటీర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రజలకు 1,200 టాయిలెట్స్ ను నిర్మించారు. 1,200 వైద్య శిబిరాలు, 23 ఎల్‌సిడి లు, రెండు పెద్ద ఎల్‌సిడిలు, రెండు సెంటర్ లైటింగ్‌లు ఏర్పాటు చేశారు. సభ నిర్వహణ ఏర్పాట్లపై ఇప్పటికే మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు రెండు రోజుల క్రితం ఇక్కడకు వచ్చి ఏర్పాట్లను సమీక్షించి కావల్సిన చేర్పు లు, మార్పులను చేపట్టి, వాటిపై సూచనలు చేసి దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత జాగృతి అధ్యక్షురాలు, పార్టీ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత సభా వే దికను సందర్శించి అక్కడ ఏర్పాట్లను చూసి సం తృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం సభ వేదిక పనులు సభా స్థలానికి సంబంధించిన పనులను స్థానిక నాయకులు ఏర్పాట్లను ముమ్మరం చేశా రు. శనివారం మధ్యాహ్నం వరకు పూర్తిస్థాయిలో సభ సర్వహంగులతో పనులు పూర్తికానున్నాయి. ఇదిలా ఉంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో నాలుగు దిశల నుండి వచ్చే కార్యకర్తలకు ప్రజలకు స్వాగ త తోరణాలను భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. నగరం మొత్తం గులాబీమయంతో గుబాలించే వి ధంగా తోరణాలు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.
27 ఉదయానికే ఎడ్లబండ్లు, పాదయాత్రలతో చేరిక
భారీ బహిరంగ సభకు రాష్ట్రం నుండి ఎడ్లబండ్లతో బయలుదేరిన బిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు 27 ఉదయం నుండి మధ్యాహ్నం వరకు బహిరంగ సభాస్థలికి చేరుకోనున్నారు. ఎడ్లబండ్లకు సంబంధించిన విడిది ఏర్పాట్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సిద్దిపేట ఖమ్మం కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి బిఆర్‌ఎస్, బిఆర్‌ఎస్‌వి ఆధ్వర్యంలో పాదయాత్రల ద్వారా కార్యకర్తలు, నాయకులు బయలుదేరారు. వారందరూ ఆదివారం మధ్యాహ్నం వరకు సభా వేదికకు చేరుకోనున్నారు.