- Advertisement -
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. లష్కరే టెర్రరిస్టులు, అనుమానితులను పట్టుకునేందుకు భారత్ ఆర్మీ కాశ్మీర్ వ్యాప్తంగా జల్లెడ పడుతోంది. ఈ క్రమంలో ఐదుగురు ఉగ్రవాదుల ఇండ్లను పేల్చేస్తున్నారు. శుక్రవారం రాత్రి.. ఎసాన్ ఉల్ హక్, షబీర్ అహ్మద్ కుట్టే, జకీర్ గని, షాహిద్ అహ్మద్, అషాన్ షేక్ అనే ఉగ్రవాదుల ఇళ్లను సైనికులు కూల్చేశారు.
కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మాకు సంబంధం లేదంటూనే సరిహద్దులో పాక్ భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. గత రెండు రోజులుగా రాత్రి సమయంలో సరిహద్దులో పాక్ కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతో భారత ఆర్మీ.. పాక్ కాల్పులను తిప్పికొడుతోంది. ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు.
- Advertisement -