న్యూఢిల్లీ: స్మార్ట్ హోమ్ టెక్నాలజీ ఉపకరణాలలో ప్రపంచ అగ్రగామి అయిన డ్రీమ్ టెక్నాలజీ, బాలీవుడ్ నటి కృతి సనన్‌ను తమ మొదటి భారతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నకున్నట్లు వెల్లడించింది. భారత మార్కెట్‌కు వినూత్నమైన మరియు తెలివైన గృహ పరిష్కారాలను తీసుకురావాలనే డ్రీమ్ ప్రయాణంలో ఈ భాగస్వామ్యం ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది.
డ్రీమ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను శర్మ మాట్లాడుతూ, “కృతి సనన్‌ను డ్రీమ్ కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. సాంకేతికత పట్ల ఆమెకున్న ఆసక్తి మరియు ముందస్తు ఆలోచనలతో కూడిన మనస్తత్వం, తెలివైన పరిష్కారాలు, ఉత్పత్తుల ద్వారా భారతీయ గృహాలను పునర్నిర్వచించాలనే మా లక్ష్యంకు అనుగుణంగా ఉంటుంది. డ్రీమ్ యొక్క ప్రపంచ విస్తరణ వ్యూహంలో భారతదేశం అంతర్భాగం” అని అన్నారు.
డ్రీమ్ టెక్నాలజీ ముఖ చిత్రంగా, కృతి సనన్ బ్రాండ్ యొక్క విస్తృత శ్రేణి స్మార్ట్ హోమ్ క్లీనింగ్ ఉపకరణాలు, గ్రూమింగ్ ఉత్పత్తులకు ప్రచారం చేయనున్నారు. వీటిలో రోబోటిక్ వాక్యూమ్‌లు, కార్డ్‌లెస్ స్టిక్ వాక్యూమ్‌లు, హై-స్పీడ్ హెయిర్ డ్రైయర్‌లతో సహా గ్రూమింగ్ ఉత్పత్తులు ఉన్నాయి. కృతి సనన్ మాట్లాడుతూ.. “డ్రీమ్ టెక్నాలజీలో భాగం కావడం సంతోషంగా ఉంది. సౌకర్యంతో ఆవిష్కరణలను మిళితం చేయాలనే నా అభిరుచిని ప్రతిధ్వనించే బ్రాండ్ ఇది” అని అన్నారు.