Sunday, April 27, 2025

కుప్వారా, మాచిల్‌లో భారీగా ఆయుధాలు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత జమ్ముకశ్మీర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. భద్రతా బలగాలు రాష్ట్రం నలుమూలలు ఉగ్రవాదలు కోసం జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే లష్కర్-ఎ-తాయిబా ప్రధాన కమాండర్ అల్తాఫ్ లిల్లీని భద్రతా బలగాలు హతమార్చాయి. మరోవైపు ఉగ్రవాదులు భద్రతా బలగాల నుంచి తప్పించుకొనేందుకు స్థావరాలను మారుస్తున్నారు.

ఈ నేపథ్యంలో కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల కోసం నిర్వహించిన కూంబింగ్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదులు భారీగా దాచి పెట్టిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మాచిల్ ప్రాంతంలో కూడా నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. అక్కడ ఎకె-47 తుపాకులు, మేగజైన్లు, పిస్టోళ్లు, పేలుడు పధార్థాలు దొరికాయి. దీని వెనుక భారీ ఉగ్రవాద కుట్ర దాగి ఉందని భావిస్తున్న అధికారులు, భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News