Sunday, April 27, 2025

రాజకీయాల్లోకి కొత్త తరం రావాలి: రాహుల్‌ గాంధీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కన్యాకుమారి నుంచి సుమారు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశానని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ అన్నారు. పాదయాత్ర మొదలుపెట్టక ముందు ఆలోచించానని.. మొదలు పెట్టాక వెనకడుగు వేయలేదని ఆయన పేర్కొన్నారు. హెచ్‌ఐసిసిలో జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో సాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పాదయాత్ర మొదలుపెట్టాక చాలా మంది తనతో కలిసి నడవటం మొదలుపెట్టారని తెలియజేశారు.

పాదయాత్రలో జనం సమస్యలు వినటం నేర్చుకున్నానని అన్నారు. తాను భారత్ సమ్మిట్‌లో శుక్రవారమే పాల్గొనాల్సింది కానీ.. కశ్మీర్‌కి వెళ్లడం వల్ల రాలేకపోయానని తెలిపారు. గత పది సంవత్సరాలలో ప్రపంచ రాజకీయాలు చాలా మారిపోయాయని అన్నారు. ఆధునిక సమాజిక మాధ్యమాలతో అంతా మారిపోయిందని.. రాజకీయాల్లోకి కొత్తతరం రావాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News