- Advertisement -
మెదక్ జిల్లా, నర్సాపూర్ మండల ప్రధాన రహదారి చిన్నచింతకుంట టర్నింగ్ వద్ద శనివారం రాత్రి 7 గంటల సమయంలో లారీ, రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. కౌడిపల్లి మండలం, వెంకట్రావ్‌పేట గ్రామానికి చెందిన మాల గోపి, అతని భార్య పూజ, కుమారుడు లోకేష్, గోపి వదిన కూతురుతో కలిసి మోటార్ సైకిల్‌పై శివ్వంపేట మండలం, గోమారం గ్రామానికి వెళ్తున్నారు. అదే సమయంలో మెదక్-నర్సాపూర్ ప్రధాన రహదారిలో టర్నింగ్ చిన్న చింతకుంట వద్ద రెండు బైకులు, లారీ ఢీకొన్నాయి. ఒక బైకుపై వెళ్తున్న గోపి, అతని కుమారుడు లోకేష్, గోమారం గ్రామానికి చెందిన అతని వదిన కూతురు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఈ సంఘటనపై ఎస్‌ఐ బి. లింగంను వివరణ కోరగా ఇంకా పూర్తి వివరాలు తెలియలేదని తెలిపారు.
- Advertisement -