మన తెలంగాణ/హైదరాబాద్/వరంగల్ బ్యూ రో: బిఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించనున్న బిఆర్‌ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిమంది తరలిరానున్నందున ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. బిఆర్‌ఎస్ 25 ఏండ్ల పండుగను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేశాయి. లక్షలాదిగా తరలివచ్చే జ నానికి అందుకు తగ్గట్టుగానే తాత్కాలిక వసతి సౌకర్యాలు సిద్ధమయ్యాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభ కోసం బిఆర్‌ఎస్ పార్టీ ఘనంగా ఏ ర్పాట్లు చేసింది. మహాసభ ప్రాంగణాన్ని 154 ఎకరాల్లో సిద్ధం చేసిం ది. 500మంది కూర్చునేలా గులాబీ రంగులతో వేదికను తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో స్టేజ్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఎల్కతుర్తికి వచ్చే అన్ని రోడ్డు మార్గాల్లో చెత్తను, ముండ్ల చెట్లను తొలగించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చే శారు.
ప్రతి రోడ్డుకు ఇరువైపులా మొరం పోసి చదును చేశారు. సభకోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50 వేల వాహనాల వస్తాయని అంచనా వేస్తున్నారు. పార్కింగ్ కో సం 1,059 ఎకరాలను కేటాయించారు. వీఐ పీ వాహనాల కోసం సభావేదిక ఎడమ భాగం, వెనుకభాగంలో పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. సభకు వచ్చే ప్రజల కోసం లక్షకుపైగా కుర్చీలను ఏర్పాటు వేశారు. మహిళల కోసం ప్రత్యేక కుర్చీలు వేసి బారికేడ్లు పెట్టారు. లైట్లు, ఎల్‌ఈడీల కోసం 200 భారీ జనరేటర్లను ఏర్పాటు చేశారు. కెసిఆర్ అందరికీ స్పష్టంగా కనిపించేలా 20/50 సైజుతో కూడిన 23 ఎల్‌ఈడీ భారీ స్క్రీన్లు, భారీ సౌండ్ సిస్టంను చుట్టుపక్కల ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారి కోసం 6 అంబులెన్సులు, 12 వైద్య శిబిరాలు, 1,200 టెంపరరీ మరుగుదొడ్ల ఏర్పాటు చేశారు. 10 లక్షల వాటర్ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. పార్కింగ్ నిర్వహణకు 2,000 మంది వలంటీర్లు సేవలు అందించనున్నారు.
బిఆర్‌ఎస్ చరిత్రలో మరో ఘట్టం
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడు పోసుకున్న బిఆర్‌ఎస్‌కు 25 సంవత్సరాలు నిండాయి. 2001లో ఏర్పడి 2014లో రాష్ట్రాన్ని సాధించే దాకా పుట్టినగడ్డ విముక్తి కోసం లెక్కలేనన్ని పోరాటాలు చేసిన బిఆర్‌ఎస్, అధికారంలోకి వచ్చిన తరువాత పదేండ్ల పాటు సుపరిపాలన అందించి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది. 17 నెలల క్రితం రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కేవలం 2.05 శాతం ఓట్ల తేడాతో బిఆర్‌ఎస్ అధికారం కోల్పోయిది. అప్పటి నుంచి ప్రతిపక్ష స్థానంలో ఉంటూ బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తున్నది. లగచర్ల ఘటనను దేశం దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు మూసీ, హైడ్రా బాధితులకు పక్షాన పోరాటం చేసింది. ఇటీవల హెచ్‌సియు విద్యార్థుల పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచి 400 ఎకరాల పచ్చటి అటవీ భూమిని కాపాడటంలో విజయం సాధించింది. తన 25 ఏండ్ల రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బిఆర్‌ఎస్ సిద్ధమయ్యింది.
సా.5 గంటలకు సభ ప్రారంభం
బిఆర్‌ఎస్ రజతోత్సవ సభ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై, 6.30కు ముగిసేలా ఏర్పాట్లు చేశారు. గులాబీ పార్టీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఏం మాట్లాడతారో అని పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాలు ఆసక్తి గమనిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి బిఆర్‌ఎస్ శ్రేణులు సభకు తరలివస్తున్న నేపథ్యంలో సురక్షితంగా తిరిగి స్వస్థలాలకు వెళ్లేలా రాత్రి 7 గంటల లోపు సభను ముగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సభా ప్రాంగణం వద్ద సిసి కెమెరాల ఏర్పాటు చేయడంతోపాటు తాత్కాలిక కమాండ్ కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశారు.
9 గంటలకు తెలంగాణ భవన్‌లో కెటిఆర్ జెండా ఆవిష్కరణ
బిఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 9 గంటలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలంగాణ భవన్‌లో జెండా ఆవిష్కరించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, 10.30 గంటలకు ట్యాంకుబండ్ వద్ద ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు ఎల్కతుర్తికి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు ఎల్కతుర్తిలో బిఆర్‌ఎస్ రజతోత్సవ మహాసభ వద్దకు చేరుకుంటారు. అలాగే ఆదివారం గ్రామాలు, మున్సిపాలిటీల్లో పార్టీ వర్గాలు బిఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి సభకు బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
బిఆర్‌ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లు
1,213 ఎకరాల్లో రజతోత్సవ సభ ఏర్పాట్లు
154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం
500 మంది కూర్చునేలా ప్రధాన వేదిక
1,059 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు
10 లక్షల వాటర్ బాటిళ్లు
16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు
వివిధ రూట్లలో 6 అంబులెన్స్‌లు
పరిసరాల్లో 12 వైద్యశిబిరాలు
1,200 తాత్కాలిక మరుగుదొడ్లు
పార్కింగ్ నిర్వహణకు 2,000 మంది వాలంటీర్లు
మరికొన్ని ఏర్పాట్లు
6 అంబులెన్సులు, 12 వైద్య శిబిరాలు
1,200 టెంపరరీ మరుగుదొడ్ల ఏర్పాటు
10 లక్షల వాటర్ బాటిళ్లు
16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు
పార్కింగ్ నిర్వహణకు 2,000 మంది వలంటీర్లు
రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతుంది : కెటిఆర్
ఓరుగల్లు వేదికగా జరగనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు గులాబీ సైనికులతో పాటు తెలంగాణ సబ్బండవర్గాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్య నేతలతో కెటిఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి గ్రామంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఉదయాన్నే గులాబీ జెండాలు ఆవిష్కరించుకొని కదలిరావాలని సూచించారు. పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన సభ కాబట్టి సభకు హాజరయ్యే వారు గులాబీ రంగు దుస్తులు ధరించి రావాలని కోరారు. రాష్ట్ర నలుమూలల నుంచి సభకు తరలిరావాలనే ఉత్సాహం ప్రజల్లో పెద్ద ఎత్తున ఉందని, వారందరినీ సమన్వయం చేసుకొని అనుకున్న సమయానికి సభా ప్రాంగణానికి చేరుకునేలాగా ప్రణాళిక వేసుకోవాలని కోరారు. పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు తరలివచ్చే ప్రతి వాహనానికి అన్ని వైపులా గులాబీ జెండాలను కట్టుకుని ఉత్సాహంగా బయలుదేరాలని పేర్కొన్నారు.
ఎండల వల్ల ఇబ్బంది లేకుండా ప్రతి బస్సులో మంచినీళ్ల బాటిళ్ళు, మజ్జిగ ప్యాకెట్లతోపాటు భోజన వసతికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ నలువైపుల నుంచి తరలివచ్చే వాహనాలు ట్రాఫిక్ జామ్ కాకుండా ఇప్పటికే రూట్ మ్యాప్ పంపించామని, దానికి అనుగుణంగానే ఆయా రూట్లలో సభ స్థలికి చేరుకోవాలని తెలిపారు. సభా ప్రాంగణానికి 30 కిలోమీటర్ల దూరం నుంచి రోడ్లపై ఎక్కడ వాహనాలు నిలపరాదని, నేరుగా వారికి సూచించిన పార్కింగ్ స్థలాలకు చేరుకొని మాత్రమే వాహనాలను నిలపాలని తెలిపారు. అనేక ప్రాంతాల్లో పార్టీ వాలంటీర్లు ఎప్పటికప్పుడు గైడ్ చేసేందుకు సిద్ధంగా ఉంటారని వెల్లడించారు. సభకు చేరుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ మంచినీటి బాటిళ్లతోపాటు, మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు వాలంటీర్లు సిద్ధంగా ఉంటారని తెలిపారు. చారిత్రక సభలో కెసిఆర్ ప్రసంగంపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొని ఉందని, రాష్ట్ర రాజకీయాల్లో ఈ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతుందని కెటిఆర్ స్పష్టం చేశారు.