పదేళ్లలో మారిపోయిన
రాజకీయాల తీరు పాతతరం
అంతరించిపోయింది కొత్త
తరాన్ని ప్రోత్సహించాలి
ప్రస్తుతం విపక్షాలకు సభలో
మాట్లాడే అవకాశం రావడం
లేదు విపక్షాల వాదన
వినిపించేందుకు కొత్త వేదికలు
వెతుక్కోవలసివస్తున్నది భారత్
సమ్మిట్2025లో కాంగ్రెస్
అగ్రనేత రాహుల్ గాంధీ
మన తెలంగాణ/హైదరాబాద్: విద్వేష రాజకీయాలు చేయకుండా ప్రజలకు ప్రేమను పంచాల ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చా రు. గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక సామాజిక మాధ్యమాలతో అంతా మారిపోయిందని ఆయన తెలిపారు. రాజకీయాల్లోకి కొత్త తరం రావాలని, పాతతరం నాయకత్వం అంతరించిపోతుందని రాహుల్‌గాంధీ సూచించారు. కొత్త తరం భాషను రాజకీయ నాయకులు అర్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. కొత్త తరాన్ని ప్రోత్సహించాలి, యువ నేతలను తయారు చేయాలని రా హుల్ గాంధీ తెలిపారు. దేశ సమస్యలు తెలుసుకునేందుకు కన్యాకుమారి నుంచి సుమారు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశానని, పాదయాత్ర మొదలుపెట్టక ముందు ఆలోచించానని, మొదలుపెట్టాక వెనకడుగు వేయలేదని ఆయన వివరించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న భార త్ సమ్మిట్2025 కార్యక్రమంలో రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పాదయాత్రలో జనం సమస్యలు వినడం నేర్చుకున్నా
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ పాదయాత్ర మొదలు పెట్టాక చాలా మంది నాతో కలిసి నడవటం మొదలుపెట్టారన్నారు. పాదయాత్రలో జనం సమస్యలు వినడం నేర్చుకున్నానని, ఇప్పుడు వారి సమస్యలు వినడంలో నాయకులు విఫలమయ్యారని రాహుల్‌గాంధీ వివరించారు. భారత్ జోడో యాత్రలో 4వేల కిలోమీటర్లు నడిచానని కన్యాకుమారి నుంచి తన పాదయాత్ర మొదలుపెట్టానని 10 రోజుల తర్వాత చూస్తే నాతో పాటు నడిచే వారి సంఖ్య పెరిగిపోయిందని ఆయన అన్నారు. ఈ యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నానని, సగం దూరం నడిచేటప్పటికి తాను గతంలో మాదిరిగా లేనని, ప్రజలతో ఎలా మాట్లాడాలో, వారి సమస్యలు ఎలా వినాలో నేర్చుకున్నానని ఆయన తెలిపారు. తాను గతంలో ఎప్పుడూ ప్రజలపై ఉన్న ప్రేమను వ్యక్తపరచలేదని, కానీ, యాత్రలో తాను ప్రజలపై తన ప్రేమను వ్యక్త పరచగలిగానని ఆయన పేర్కొన్నారు. తాను ఎప్పుడైతే ప్రజలపై తన ప్రేమను వ్యక్తపరిచానో అప్పటి నుంచి అందరూ స్పందిస్తున్నారని రాహుల్ గాంధీ తెలిపారు.
ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమే కొనసాగుతోంది
శుక్రవారం భారత్ సమ్మిట్‌లో పాల్గొనాల్సి ఉన్నా, కాశ్మీర్‌కు వెళ్లడం వల్ల రాలేకపోయానని ఆయన తెలిపారు. గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు ఎంతో మారిపోయాయని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఆధునిక, సామాజిక మాధ్యమాలతో అంతా మారిపోయిందని ఆయన తెలిపారు. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమే కొనసాగుతోందని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలను అణచివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన వాపోయారు. విపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం రావడం లేదన్నారు. ఇక్కడే కాదు విపక్ష పార్టీలు ప్రపంచ వ్యాప్తంగా అణిచివేతకు గురవుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. విపక్షాల వాదన వినేందుకు కొత్త వేదికలు వెతుక్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
మీడియా స్వేచ్ఛకు కూడా సంకెళ్లు వేశారని ఆయన మండిపడ్డారు. దేశంలో మహిళలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడా సమస్యల పరిష్కారానికి ప్రజలే మార్గాలు వెతుక్కుంటు న్నారని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. నాయకులు కూడా ప్రజలు చూపించిన మార్గాల్లోనే వెళ్లాలని ఆయన సూచించారు. భారత్ జోడో యాత్ర తో దేశం మొత్తం తిరిగానని ఎన్నో విషయాలు తెలుసుకున్నానని ఆయన అన్నారు. దేశ ప్రజలు తనపై ఎంతో ప్రేమ చూపించారని ఆయన తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్ నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి రాహుల్ శుభాకాంక్షలు తెలిపారు.
మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాహుల్
శనివారం మధ్యాహ్నం ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్ ర్టులో రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు సహా కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా హైటెక్ సిటీకి రాహుల్‌గాంధీని తీసుకొచ్చారు. అనంతరం రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలతో కలిసి భారత్ సమ్మిట్ లో పాల్గొని ప్రసంగించారు.