Monday, April 28, 2025

పాక్ కవ్వింపు చర్యలు.. మరోసారి సరిహద్దులో కాల్పులు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: సరిహద్దులో మరోసారి పాకిస్థాన్ కాల్పులకు పాల్పడింది. శనివారం మధ్య రాత్రి నియంత్రణ రేఖ (LOC) వెంబడి పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరిపినట్లు భారత ఆర్మీ తెలిపింది. సరిహద్దు వెంబడి టుట్మారి గాలి, రాంపూర్ సెక్టార్లకు ఎదురుగా ఉన్న ప్రాంతాలలో పాకిస్థాన్ దళాలు కాల్పులకు పాల్పడటంతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం కాల్పులకు తిప్పికొట్టింది. ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

కాగా, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్ మాకు సంబంధం లేదంటూనే భారీగా సైన్యాన్ని సరిహద్దుకు తరలిస్తోంది. కాగా, ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఉగ్రవాదుల ఏరివేసేందుకు భారత ఆర్మీ ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తోంది. ఈక్రమంలో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News