ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో(3.4) ఓపెనర్ అభిషేక్ పోరెల్ (28; 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లు) వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కృనాల్ పాండ్య బౌలింగ్‌లో(9.5) డుప్లెసిస్ (22;26 బంతుల్లో 2 ఫోర్లు) విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెఎల్ రాహుల్(41; 39 బంతుల్లో 3 ఫోర్లు) భువనేశ్వర్ వేసిన 16.2 ఓవర్ లో జాకబ్ బెథెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ట్రిస్టన్ స్టబ్స్ (34; 18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4, హేజిల్‌వుడ్ 2, కృనాల్ పాండ్యా ,యశ్ దయాళ్ చెరో వికెట్ తీశారు.
బెంగళూరు లక్ష్యం 163
- Advertisement -
- Advertisement -
- Advertisement -