విచారణ ముమ్మరం చేసిన
దర్యాప్తు సంస్థ కీలకంగా
మారిన ఓ ఫొటోగ్రాఫర్ వీడియో
దాడికి సహకరించిన 15మంది
స్థానికులు 22 గంటల పాటు
గుట్టలు ఎక్కి దిగివచ్చిన
టెర్రరిస్ట్‌లు
న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఇ టీవల జరిగిన ఘోర ఉగ్ర దాడి కేసు దర్యాప్తు బా ధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) స్వీకరించింది. ఈ దాడిలో ఒక నేపాల్ జాతీయునితో సహా మొత్తం 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఈ కేసును ఎన్‌ఐఎకి బదలీ చేసినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇప్పటి వరకు ఈ కేసు దర్యాప్తును జమ్మూ కాశ్మీర్ పోలీసులు పర్యవేక్షించారు. అయితే, ఘటన తీవ్రత దృ ష్టా కేంద్ర ప్రభుత్వం దీనిని ఎన్‌ఐఎకి అప్పగించాలని నిర్ణయించింది. ఎన్‌ఐఎకి కేసు అప్పగించడం తో జమ్మూ కశ్మీర్‌లో అధికారికంగా దర్యాప్తు సం స్థ పహల్‌గామ్ ఘటనపై కేసు నమోదు చేసింది. దాడి జరిగిన మరునాడు ఈ నెల 23 నుంచే ఎన్‌ఐఎ బృందాలు పహల్‌గామ్‌లోని ఘటన స్థలంలో మోహరించాయి. ఐజి, డిఐజి, ఎస్‌పి స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఈ బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి.
సుందర పర్యాటక ప్రదేశం బైసరన్ లోయలో ఈ నెల 22న ఈ భయానక దా డిని ప్రత్యక్షంగా చూసిన సాక్షులను ఎన్‌ఐఎ అధికారులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు. సంఘటన జ రిగిన తీరును, ఉగ్రవాదుల కదలికలను కూలంకషంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఉగ్రవాదులు ఘటన స్థలానికి ఎలా చేరుకున్నారు, దాడి తరువా త ఎలా తప్పించుకున్నారు అనే కోణంలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఎన్‌ఐఎ బృందాలు నిశితం గా పరిశీలిస్తున్నాయి. ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో ఘటన స్థలంలో లభించే చిన్న ఆధారాన్నీ జాగ్రత్తగా సేకరిస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన ఉ గ్రవాదులను పట్టుకునేందుకు భద్రత బలగాలు ఇ ప్పటికే కాశ్మీర్ లోయలో గాలింపు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా గతం లో ప్రకటించిన పది మంది ఉగ్రవాదులకు చెందిన ఇళ్లను అధికారులు కూల్చివేశారు.
కీలకంగా మారిన వీడియో సాక్ష్యాలు
పహల్‌గామ్ దాడికి సంబంధించి దర్యాప్తు సంస్థల కు కీలక వీడియో ఒకటి లభ్యమైంది. పర్యాటకుల కు రీల్స్, వీడియోలు చిత్రీకరించే ఓ వీడియోగ్రాఫ ర్ తీసిన దాడికి సంబంధించిన క్లిప్పింగులు దర్యాప్తునకు కీలకంగా మారనున్నాయి. వీడియో గ్రాఫ ర్ ఉగ్రవాదుల మారణకాండను మొత్తం ఓ చెట్టుపై నక్కి పూర్తిగా చిత్రీకరించాడు. దాన్ని ఎన్‌ఐఎ సంపాదించింది. ఉగ్రవాదులు రెండు గ్రూపులుగా వీడిపోయి దారుణానికి పాల్పడినట్లు వీడియోను బట్టి స్పష్టమైంది. తొలుత ఇద్దరు ఉగ్రవాదులు పలువుని పట్టుకుని ముస్లిం మతాచారాన్ని అనుసరించాలని ఆదేశించినట్లు, పాటించని నలుగురిని అక్కడికక్కడే కాల్చి చంపినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.