Monday, April 28, 2025

గుల్జార్‌కి గలియోమె

- Advertisement -
- Advertisement -

గులాం థే తో హమ్ సబ్
హిందూస్తానీ థే
ఆజాదీ నే హమే
హిందూ ముసల్మాన్ బనాదియా

భారతీయులం మనమంతా
బానిసలుగా ఉన్నపుడే
తయారు చేసింది స్వతంత్రం
మనల్ని హిందూ ముస్లిం లుగా

మై దియా హు
మేరీ దుష్మని తో సిర్ఫ్ అంధేరే సే హై
హవా తో బేవజే హి మేరా
ఖిలాఫ్ హై

దీపాన్ని నేను
శత్రుత్వం నాది కేవలం చీకటితోనే
ఎందుకో మరి అకారణంగా
పగబట్టింది గాలి నాపై

Gulzar's Galliome

కుచ్ జకమో కి ఉమర్
నహి హోతి హై
ఏ తా ఉమర్ సాత్ చల్తే హై
జిస్మో కే ఖాక్ హోనే తక్

కొన్ని గాయాలకు
వయసుతో పని లేదేన్నడూ
వెంబడిస్తాయి మన జీవితకాలమంతా
శరీరం కాలిబూడిదయ్యే దాకా

దిల్ కే రిష్తీహమేష
కిస్మత్ సే హి బన్తే హై
వర్ణా ములాఖాత్ తో రోజ్
హజారో సే హోతి హై

అదృష్టం తోనే కలుస్తాయి ఎప్పుడూ
కొన్ని హృదయ బంధాలు
కలయికలు అయితే రోజూ
అవుతాయి కదా వేలమందితో

అనువాదం: దేవులపల్లి అమర్

బొమ్మలు: దేవులపల్లి శృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News