- Advertisement -
ములుగు: కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ ఆపాలని ఎంఎల్ఎ నాయిని రాజేందర్ డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఫామ్‌హౌస్‌లో కేంద్రం సోదాలు చేస్తే కోట్లాది రూపాయలు దొరుకుతాయని ఆరోపణలు చేశారు. కాళేశ్వరం డబ్బులతో సభలు పెడుతున్నారని దుయ్యబట్టారు. వరంగల్ బిఆర్ఎస్ సభలో జయశంకర్ ఫొటో పెట్టకుండా అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో బిఆర్ఎస్ చేయని అభివృద్ధి 16 నెలల్లో చేసి చూపించామని, బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని దుయ్యబట్టారు. పది ఏళ్ల బిఆర్ఎస్ పాలనలతో వెయ్యే ఏండ్ల విధ్వంసం చేశారని మండిపడ్డారు.
- Advertisement -