- Advertisement -
హైదరాబాద్: హిమాయత్ నగర్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనంలోని లిఫ్ట్ లో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు సదరు వ్యక్తి హత్య చేసి లిఫ్ట్ లో పడేసి వెళ్లారు. దోమలగూడా పోలీసులు క్లూస్ టీంతో వివరాలు సేకరిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలను సేకరిస్తున్నారు.
- Advertisement -