- Advertisement -
తెలంగాణలోని ఉన్నతాధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో సిఎం రేవంత్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొందరు అధికారులు డబ్బులే లక్ష్యంగా పని చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బుల కోసం పనిచేస్తున్న వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా సబ్జెక్ట్ ఉన్నవాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అధికారులు కొన్ని విషయాల్లో కొంత సమన్వయం పాటించాలని చెప్పారు.
కాగా, జానారెడ్డితో సమావేశమైన సందర్భంగా ఆపరేషన్ కగార్, కాల్పుల విరమణ వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.ఈ అంశంపై సిఎం మాట్లాడుతూ.. మావోయిస్టులతో చర్చల కోసం శాంతి కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మావోయిస్టుల అంశంపై జానారెడ్డి, కేకే పార్టీలో చర్చిస్తారని తెలిపారు.
- Advertisement -