- Advertisement -
తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇవాళ పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, పలు చోట్ల ఈదరుగాలులు వర్షం పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.
ఇక, రేపు, ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వాన కురిసే అవకాశం ఉందని చెప్పింది. హైదరాబాద్ నగరంలోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షం పడనున్నట్లు తెలిపింది. కాగా, ఇప్పటికే కురుస్తున్న అకాల వర్షాలతో పంటలు దెబ్బ తినడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోతుండటంతో నష్టపోతున్నామని.. తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
- Advertisement -