- Advertisement -
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు-నాయుడు పేట నేషనల్ హైవేపై వేగంగా వచ్చిన ఓ కారు కంట్రోల్ తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సోమవారం తిరుపతి జిల్లాలోని పాకాల మండలం తోటపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -