Tuesday, April 29, 2025

శ్రీవిష్ణు కామెడీ చింపేశాడు.. ‘సింగిల్’ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సింగిల్’. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. ట్రైలర్‌ని చూస్తే.. ఇది ఒక అబ్బాయి.. ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగే ప్రేమకథ అని తెలుస్తోంది. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు సినిమా పెద్ద హిట్ అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు విశాల్ చంధ్రశేఖర్ సంగీతం అందించారు. విద్యా కొప్పినిడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరీ ఈ సినిమాను నిర్మించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 9వ తేదీన విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News