Tuesday, April 29, 2025

వలిగొండలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతన్నల ధర్నా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /వలిగొండ: యాదాద్రి భువనగరి జిల్లా వలిగొండ మండలం లోతుకుంట ఐకెపి కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతుల ఇబ్బందులను పరిష్కారం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు. సోమవారం లోతుకుంటకు చెందిన రైతులు నిల్వ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వలిగొండ భువనగిరి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతులకు మద్దతుగా పాల్గొన్న సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ…. గత పదిహేను రోజుల క్రితం ప్రారంభం చేసిన ఐకెపి కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించకపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

అకాల వర్షం వల్ల రైతన్నలు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రభుత్వం వెంటనే కొనుగోలను ప్రారంభించి రైతుల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. మండల వ్యాప్తంగా హమాలీల కొరతతో కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ఏర్పడుతున్నాయని వెంటనే హమాలీల కొరతను నివారించాలని, లారీల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటి సభ్యులు కలుకూరి రామచందర్, వలిగొండ పట్టణ నాయకులు కొండూరు సత్తయ్య, రైతులు రాచకొండ కిష్టయ్య, శీల పాండు, తోటకూరి ఇస్తారి, రాచకొండ సత్తయ్య, సంకబుడ్డి శ్రీను, సాలయ్య, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News