- Advertisement -
శామీర్ పేట: మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పై ఎసిబి దాడులు చేసింది. హైదరాబాద్ నగర శివారు ఉప్పల్ ప్రాంతంలోని ఫ్రీడం ఆయిల్ కంపెనీ గోదాం నుంచి నూనె చోరికి గురైంది. చోరికి గురైన ఆయిల్ తనిఖీల్లో బాగంగా షామీర్ పేట పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే పట్టుబడిన ఆయిల్ ను రికవరీ చేసి ఇవ్వడానికి పోలీసులు డబ్బులు డిమాండ్ చేశారు. మొదటి విడతగా కొన్ని డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులు ఇస్తుండగా ఎసిబి అధికారులు పోలీసులను పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వారిలో ఎస్సై పరశురాములు ఉండగా మరికొందరు పోలీసు అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా పోలీస్టేషన్ లో దర్యాప్తు కొనసాగుతోంది. ఫ్రీడమ్ ఆయిల్ యజమాని నుండి 2లక్షలు రూపాయలు డిమాండ్ చేయగా యజమాని 22 వేలు రూపాయలు పోలీసులకు ఇస్తుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.
- Advertisement -