మన తెలంగాణ/హైదరాబాద్: తప్పుడు ప్రమాణ పత్రాలతో పిటిషన్ దాఖలు చేసి న గ్రూ ప్1 అభ్యర్థులకు హైకోర్టు రూ.20 వేల జరిమానా విధించింది. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించిం ది. టిజిపిఎస్‌సి నిర్వహించిన గ్రూప్1 మూల్యాంకనంలో అవకతవకలు చోటు చే సుకున్నాయంటూ మొత్తం 19మంది పిటిషన్ దాఖలు చేశారు. మెమోకు, వెబ్‌సైట్‌లోని మార్కులకు తేడాలున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. రీవాల్యుయేషన్ చేసి మార్కులు పారదర్శకంగా వెల్లడించాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ బీమపాక సోమవారం విచారణ చేపట్టా రు. పిటిషనర్లు తప్పుడు ప్రమాణ పత్రాలు దాఖలు చేశారని టిజిపిఎస్‌సి తరపు న్యా యవాది కోర్టుకు వెల్లడించారు. ప్రాథమిక వివరాలను పరిశీలించిన న్యాయస్థానం అ భ్యర్థులు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని పే ర్కొంది. వాస్తవాలను దాచి కోర్టును తప్పు దోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
గ్రూప్1 పిటిషనర్లకు హైకోర్టు జరిమానా
- Advertisement -
- Advertisement -
- Advertisement -