Tuesday, April 29, 2025

మావోయిస్టులతో చర్చలకు శాంతి కమిటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మావోయిస్టుల అంశంపై జానారెడ్డి, కెకెతో చర్చ జరిగినట్లు సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గతంలో మావోయిస్టులతో చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డి, కెకెలకు (కే.కేశవరావు) ఉందని, ఇప్పుడు కూ డా అదేవిధంగా వ్యవహారించేందుకు అధిష్టా నం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని ఆ యన వెల్లడించారు. పార్టీ హైకమాండ్‌కు స మాచారం ఇచ్చి పీస్ కమిటీకి విజ్ఞప్తి పంపిస్తామని ఆయన తెలిపారు. మావోయిస్టులతో చ ర్చల కోసం శాంతి కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. మావోయిస్టుల అంశంపై జానారెడ్డి, కే కేశవరావు పార్టీలో చర్చిస్తారని తెలిపారు. ఆపరేషన్ కగార్ పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని అధిష్టానానికి పీస్ కమిటీ ప్రతిపాదనలు పంపిస్తామని ఆయన చెప్పారు. దీనిపై తమ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ విధానం ప్రకటిస్తామన్నారు.

కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని శాంతి చర్చల కమిటీతో సిఎంను కోరింది. ఈ అంశంతో పాటు ఆపరేషన్ కగార్, మావోయిస్టుల అంశంపై సిఎం రేవంత్ జానారెడ్డితో చర్చించారు. సోమవారం జానారెడ్డి నివాసానికి వెళ్లిన సిఎం రేవంత్ రెడ్డి అక్కడ జానారెడ్డి, కేకే, వేం నరేందర్ రెడ్డితో కలిసి ఆదివారం శాంతి కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు, అపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణపై వారితో చర్చించారు. కాగా, 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఇందు కోసం ఆపరేషన్ కగార్ చేపట్టింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ ముమ్మరంగా సాగుతోన్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News