- Advertisement -
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యువకుడిని దారుణంగా హత్య చేశారు. వ్యవసాయ మార్కెట్‌లో పట్టపగలే ఓ యువకుడిని పొడిచి చంపి అనంతరం మృతదేహాన్ని పలుమార్లు తన్నుతూ నిందితుడు వికృతానందం పొందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలం కుమార్ అనే యువకుడి మెడపై సంతోష్ అనే వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. కుమార్ చనిపోయినా కూడా అతడి మృతదేహాన్ని కాలితో తన్నుతూ వికృతానందం పొందాడు. సంతోష్ భార్యతో పొలం కుమార్ అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రియురాలి ముందే ప్రియుడ్ని భర్త హత్య చేయడంతో భార్య సొమ్మసిల్లిపడిపోయింది. నిందితుడు సంతోష్ స్వస్థలం ధర్మారం మండలం దొంగతూర్తి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దంపతులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
- Advertisement -