Tuesday, April 29, 2025

‘హిట్ 3’ సూపర్ డూపర్ హిట్ అవుతుంది: ఎస్‌ఎస్ రాజమౌళి

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్: ది థర్డ్ కేస్’. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ మూవీ మే 1న పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి మాట్లాడుతూ “ఇండస్ట్రీలో మేమంతా ప్రశాంతిని హిట్ మిషన్ అని పిలుస్తుంటాము.

తను 100 శాతం సక్సెస్‌ఫుల్ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్. ఐదో సినిమాగా వస్తున్న హిట్ 3 సినిమా కూడా అదే సక్సెస్ ట్రాక్ లోకి వెళ్తుందని నాకు గట్టి నమ్మకం. ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని తెలియజేస్తున్నాయి”అని అన్నారు. నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ “దర్శకుడు శైలేష్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఒక కమర్షియల్ మాస్, థ్రిల్లర్ ఫిలిం కలిస్తే ఎలా ఉంటుందో హిట్ 3 లో చూస్తారు”అని తెలిపారు. డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ “ఈ సినిమా కోసం నన్ను ఇంత బలంగా నమ్మిన నానికి థాంక్యూ.

ఇది చాలా హానెస్ట్ ఫిలిం. వయోలెంట్ గా ఉంటుంది. సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి”అని పేర్కొన్నారు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ “నానితో కలిసి నటించడం అద్భుతమైన అనుభూతినిచ్చింది. ఈ సినిమా కూడా కేజిఎఫ్‌లా అద్భుతమైన విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోలు అడివి శేషు, విశ్వక్‌సేన్, నిర్మాత ప్రశాంతి తిపిర్నేని, సతీష్, రామ్ జగదీష్, నాగేంద్ర, శ్రీనాథ్ మాగంటి, అమిత్ శర్మ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News