Tuesday, April 29, 2025

కెనడాలో భారతీయ విద్యార్థిని హత్య?

- Advertisement -
- Advertisement -

ఒట్టావా: కెనడాలో ఓ భారతీయ విద్యార్థిని అనుమానాస్పదంగా చనిపోయింది. అదృశ్యమైన వంశిక (21) మృతదేహం బీచ్‌లో కనిపించింది. భారత హైకమిషన్, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆప్ నేత దేవిందర్ సింగ్ కుమార్తె వంశిక పైచదువుల కోసం రెండన్నర సంవత్సరాల క్రితం కెనడాకు వెళ్లింది. గత శుక్రవారం అద్దె ఇంటిని వెతకడం కోసం బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో సన్నిహితుల ద్వారా కెనాడాలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆమె మృతదేహం బీచ్‌లో కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకొని కెనడాలో ఉన్న భారత హైకమిషన్‌కు సమాచారం ఇచ్చారు. వంశిక మృతిపై కెనడాలోని భారత హైకమిషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News