- Advertisement -
టిఎస్‌ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రేమ, కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తుండగా, ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. హరికృష్ణ హీరోగా, భవ్య శ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు భావోద్వేగపు అనుభవాన్ని అందించనుంది. ఈ సినిమాను ప్రేమకథతో పాటు కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ చూడని ఒక వైవిధ్యమైన ప్రేమ కథని చూపించబోతున్నామని అన్నారు. ప్రొడ్యూసర్ తిరుపతి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ కొత్త జోనర్‌లో వైవిధ్యమైన లొకేషన్‌లలో ఈ సినిమాని తెరకెక్కించి ఆడియన్స్ కి ఒక కొత్త అనుభూతినిస్తామని తెలిపారు.
- Advertisement -