Tuesday, April 29, 2025

బాలుడి నుంచి రూ.2 లక్షలు కాజేసిన ట్యూషన్ టీచర్….పట్టించుకోని పోలీసులు

- Advertisement -
- Advertisement -

జీడిమెట్ల: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ట్యూషన్ టీచర్ నిర్వాకం వెలుగులోకి  వచ్చింది. ట్యూషన్ కు వచ్చిన బాలుడు నుంచి లక్షల రూపాయలు ట్యూషన్ టీచర్ కాజేశాడు.  బాలుడిని ట్యూషన్ టీచర్ అడగటంతో ఇంట్లో దొంగతనం చేసి రెండు లక్షల రూపాయలు సదరు టీచర్ ఇచ్చాడు. బాలుడు రీసెంట్ గా ఐఫోన్ సైతం ట్యూషన్ టీచర్ కు ఇచ్చాడు.  తనకు ఐ ఫోన్ వద్దని, డబ్బులు కావాలని చెప్పడంతో బాలుడు ఫోన్ ను అమ్మకానికి పెట్టాడు. మొబైల్ షాప్ ఓనర్ బాలుడు తండ్రికి సమాచారం ఇచ్చాడు. ఈ విషయం తెలిసి బాలుడి తండ్రి అవాక్కయ్యాడు. జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని బాలుడి తండ్రి ఆరోపణలు చేస్తున్నారు. ట్యూషన్ టీచర్ పై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీ లో బాలుడు తండ్రి కమల్ ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News