బీజింగ్: చైనాలో ఘరో అగ్ని ప్రమాదం సంభవించింది. చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లోని ఇయాయోంగ్ నగరంలో మంగళవారం జరిగిన ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్న మాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, ఈ నెలలో చైనాలో జరిగిన రెండవ అతిపెద్ద అగ్నిప్రమాదం రెస్టారెంట్ అగ్నిప్రమాదం. అంతకుముందు, ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్‌లోని ఒక నర్సింగ్ హోమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 20 మంది వృద్ధులు మరణించారు.