- Advertisement -
గత బిఆర్ఎస్ ప్రభుత్వం కక్కుర్తి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై ఒక బాధ్యత గల పౌరుడిగా మాట్లాడుతున్నానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరంతరం అసత్యాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. తుమ్మిడి హెట్టి దగ్గర 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు 38 వేల కోట్లతో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారని చెప్పారు. కొంత మేరకు పనులు కూడా జరిగాయని తెలిపారు. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్, రీ డిజైన్ చేసిందని.. తుమ్మిడి హెట్టి దగ్గర రెండు ప్రాజెక్టులు కడతామని చెప్పి తట్టెడు మట్టి పోయలేదని విమర్శించారు.
- Advertisement -