- Advertisement -
సిఎం రేవంత్ రెడ్డి రేపు విజయవాడ వెళ్లనున్నారు. బెజవాడలో జరుగనున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహానికి ఆయన హాజరు కాబోతున్నారు. సిఎం రేవంత్‌రెడ్డి విజయవాడ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం 9.15 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ఆయన బయల్దేరి వెళ్లనున్నారు. ఉదయం 10.40 గంటలకు కానూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణానికి చేరుకుంటారు. ఉదయం 10.50 గంటల నుంచి 11.30 గంటల వరకు అయన దేవినేని ఉమా కుమారుడు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. విజయవాడ నుంచి తిరిగి మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు ఆయన చేరుకోనున్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ వివాహానికి హాజరుకానున్నారు.
- Advertisement -