Monday, December 23, 2024

రాష్ట్ర ఆవతరణ స్ఫూర్తిని రగిలించిన 2కె రన్

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది స్ఫూర్తిని ప్రతిభింబించేలా జిల్లా వ్యాప్తంగా ‘తెలంగాణ రన్’ ఘనంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ 2కె రన్ కార్యక్రమం నగరంలోని సర్దార్ వల్లభాయి పటేల్ స్టేడియం నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు కొనసాగింది. ముందుగా ముఖ్యఅతిథిలుగా హాజరైన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, నగర మేయర్ నీరజ జెండా ఊపి తెలంగాణ 2కె రన్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రన్నింగ్‌తో యువతలో శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని రన్నింగ్ దానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ ప్రగతిని చాటుతూ ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన తెలంగాణ 2కె రన్ విజయవంతం చేశామన్నారు. సుపరిపాలన దినోత్సవాల పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజక వర్గాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజన, క్రీడల శాఖ భాగస్వామ్యంతో వయస్సుతో నిమిత్తం లేకుండా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొని స్పూర్తిని చాటుకున్నారన్నారు. పోటీ పరుగు కాకుండా ఐక్యతను చాటుతూ యువత తెలంగాణ 2కె రన్ పూర్తి చేసి విజయవంతం చేశారని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ అన్నారు.

ఈ సందర్భంగా చివరి పాయింట్ కు ముందుగా చేరుకున్న 25 మందికి జిల్లా కలెక్టర్, నగర మేయర్ చేతుల మీదుగా పతాకాలు అందజేశారు. తెలంగాణ రన్‌లో పెద్దఎత్తున యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. రన్ అనంతరం కలెక్టర్, పోలీస్ కమిషనర్‌లు అధికారులతో ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్లు రాధిక గుప్తా, మయాంక్ సింగ్, ట్రైనీ ఏఎస్పీ అవినాశ్ కుమార్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, అడిషనల్ డిసిపి సుభాష్ చంద్రభోస్, అడిషనల్ డిసిపి కుమారస్వామి, ఎసిపిలు రామోజీ రమేష్, గణేష్, ప్రసన్న కుమార్, జిల్లా యువజన క్రీడా అభివ్రద్ది అధికారి పరందమరెడ్డి, కార్పొరేటర్లు కొత్తపల్లి నీరజ, రాపర్తి శరత్, కార్నటి కృష్ణ, జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News