నైట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు జోడిగా డాజ్లింగ్ బ్యూటీ కృతిశెట్టి కనిపించనుంది. నిర్మాతలు బి.మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. హీరోలు నాగచైతన్య, అడవి శేష్, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, రాహుల్ సాంకృత్యాన్, వెంకీ కుడుమల, అవసరాల శ్రీనివాస్, నిర్మాత నవీన్ ఎర్నేని, నటులు శ్రీనివాస్ రెడ్డి, రాహుల్ రామకృష్ణ, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో నాగచైతన్య మాట్లాడుతూ “ఈ సినిమా ట్రైలర్ నాకు చాలా నచ్చింది. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని చెప్పారు. సుధీర్ బాబు మాట్లాడుతూ.. “ఈ కథ విన్న వెంటనే నచ్చేసింది. ఇందులో ఒక ఫిల్మ్ డైరెక్టర్ గా చేస్తున్నాను. ప్రతి డైరెక్టర్‌కి ఒక టేస్ట్ వుంటుంది. దాన్ని తిక్క అని కూడా అనొచ్చు. ఈ సినిమాలో నా పాత్ర ఎంత ముఖ్యమో కృతిశెట్టి పాత్ర కూడా అంతే ముఖ్యం. అందరూ ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. ఇంద్రగంటితో ఇది నా మూడో సినిమా”అని అన్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ “ఇది నాకు స్పెషల్ మూవీ. ఇష్టపడి రాసుకున్న కథ. సుధీర్ బాబుతో ఈ సినిమా చేయడం చాలా గర్వంగా ఉంది. ఇందులో సరికొత్త కృతిశెట్టిని చూస్తారు. శుక్రవారం సకుటుంబ సపరివార సమేతంగా మంచి హాస్యం, రోమాన్స్ ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను”అని పేర్కొన్నారు.
A Ammayi Gurinchi Meeku Cheppali Pre Release