Monday, December 23, 2024

సెప్టెంబర్ 16న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’

- Advertisement -
- Advertisement -

సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌మార్క్ స్టూడియోస్ రూపొందిస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. గాజులపల్లె సుధీర్ బాబు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 16న ఈ చిత్రం విడుదలవుతుందని ఫిల్మ్‌మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఇంద్రగంటి గత సినిమాల్లాగే ఈ సినిమాలో కూడా సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ కొత్త కొత్తగా పాటతో ఆకట్టుకున్నారు వివేక్ సాగర్. ఆల్బమ్‌లోని మిగతా పాటలు కూడా సంగీత ప్రియులను ఆకట్టుకోబోతున్నాయి. ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘A Ammayi Gurinchi Meeku Cheppali’ Release on Sep 16

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News