Wednesday, January 22, 2025

మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

A Ammayi Gurinchi Meeku Cheppali Success Meet

నెట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో విలక్షణమైన ప్రేమకథగా వచ్చిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. డాజ్లింగ్ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని బి.మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మించారు. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో తాజాగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ని నిర్వహించింది. ఈ వేడుకలో సుధీర్ బాబు మాట్లాడుతూ “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి… లాంటి గొప్ప సినిమా చేయడం చాలా గర్వంగా వుంది. సినిమా చూసిన తర్వాత చాలా ప్రశంసలు వచ్చాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అవుతున్నారు. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. తండ్రి కూతుళ్ళు కలసి సినిమాకి వెళ్తే చాలా ఆనందిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత అందరిలో ఒక పరిణితి వస్తుంది”అని అన్నారు. కృతిశెట్టి మాట్లాడుతూ “ఈ సినిమా నాకు మోస్ట్ స్పెషల్ ఫిల్మ్. ఈ సినిమాతో ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయ్యాను. సుధీర్ బాబు లాంటి మంచి యాక్టర్‌తో నటించడం ఆనందంగా వుంది” అని తెలిపారు. మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ “ఈ సినిమాకి హార్ట్ వార్మింగ్ సక్సెస్ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ప్రేక్షకులకు వినోదం పంచడంతో పాటు ఒక కొత్త కోణాన్ని చూపించాలని ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. ఇంకా ఎక్కువ మంది ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ అవ్వాలనే కోరిక వుంది. యంగ్‌స్టర్స్, ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి స్పందన వస్తోంది. సుధీర్ బాబు కెరీర్‌లోనే ఇది బెస్ట్ పర్‌ఫార్మెన్స్ అని సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాహి సురేష్, శ్రీనివాస్ వడ్లమాని పాల్గొన్నారు.

A Ammayi Gurinchi Meeku Cheppali Success Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News