Wednesday, January 22, 2025

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

‘A Ammayi Gurinchi Meeku Cheppali’ Trailer Out

హీరో సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణలు ’ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే అద్భుతమైన రోమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. నిర్మాతలు బి.మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయిక. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. సోమవారం సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. వృత్తి రీత్యా డాక్టరైన కృతి శెట్టి సినిమాల్లో నటించడానికి అంగీకరించడం, సక్సెస్‌ఫుల్ ఫిల్మ్‌మేకర్ సుధీర్ బాబు ఆమె నిర్ణయంతో సంబరంలో ఉన్నట్లుగా ట్రైలర్ ప్రారంభమైంది. కృతికి సినిమా నటి కావాలనే కోరిక ఉన్నప్పటికీ, ఆమె తల్లిదండ్రులు దానికి పూర్తిగా వ్యతిరేకం. అంతేకాదు, సినిమా పరిశ్రమపై వారికి ద్వేషం,చెడు అభిప్రాయం. ఇలాంటి నేపథ్యంలో నటి, దర్శకుడి ప్రేమకథ ఎక్కడ ముగుస్తుంది అనేది సినిమా కథా సారాంశం. ట్రైలర్‌లో సుధీర్ బాబు, కృతి శెట్టి అద్భుతమైన కెమిస్ట్రీని పంచుకున్నారు. వెన్నెల కిషోర్ వినోదాన్ని పంచారు. ఇక ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఈనెల 16న విడుదలవుతుంది.

‘A Ammayi Gurinchi Meeku Cheppali’ Trailer Out

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News