Wednesday, January 22, 2025

ములకూర్‌లో కలకలం లేపిన శిశు మృతదేహం

- Advertisement -
- Advertisement -

భీమదేవరపల్లి : మండలంలోని ములుకనూర్‌లోని శ్రీనివాసనగర్ మురికి కాలువలో పసికందు మృతదేహం లభ్యం అవ్వడం కలకలం రేపింది. అయితే ఈ పసికందు ఆడపిల్లగా స్థానికులు గుర్తించడంతో మరింత కలకలం చోటు చేసుకుంది. ఆడపిల్ల పుడితే భారమని పురిటిలోనే చిదిమేశారా…? లేక అక్రమ సంబంధాల వల్ల కలిగిన సంతానంగా భావించి నాటు వైద్యుల చేత ఆ పసికందును చిధిమేశారా అన్న విషయం ములుకనూర్ లో చర్చంశనీయమైది.

కన్న పేగును మురికి కాలువకు గురిచేసిన ఆ తల్లి ఎంత కఠినాత్మురాలో.. ? అభం శుభం తెలియని బాలికకు ఈ పరిస్థితి వచ్చిందా .. అనే అంశంపై స్థానికుల్లో చర్చాంశనీయమైది. ఈ ఘటనపై ములుకనూర్ పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేస్తుండటంతో పరిసర ప్రాంతంలోని ప్రజలు పెద్దఎత్తున గుమికుడడంతో ఆ ప్రాంతంలో విషాదచాయలు నెలకొన్నాయి. ఈ సంఘటన పై ములుకనూర్ కేసు నమోదు చేసి దర్యప్తుచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News