- Advertisement -
వారణాసి : గంగానదిలో పడవ ప్రమాదల నివారణకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నదిలో తెడ్డులతో నడిచే పడవలపై నిషేధం విధించారు. కేవలం మోటార్ బోట్ ఆపరేషన్లకు మాత్రమే అనుమతించారు. అలాగే గంగా హారతి కార్యక్రమం, సమయంలో, సూర్యాస్తమయం తర్వాత బోటింగ్ పై పూర్తిగా నిషేధం విధించారు. కెపాసిటీకి మించి ఎక్కువ మందిని కూర్చోబెట్టుకుంటే బోటును సీజ్ చేసి, జరిమానా విధించనున్నట్టు ఎండీఎం సంజయ్ కుమార్ తెలిపారు. పడవలో లైఫ్ జాకెట్లు, టార్చ్‌లు, తాళ్లు , గాలి నింపిన ట్యూబ్‌లు అవసరమైన వస్తువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పడవలో డైవర్ల మొబైల్ నంబర్లతోపాటు, ఎన్‌డీఆర్‌ఎఫ్, డిజాస్టర్ స్పెషలిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
- Advertisement -