Thursday, January 23, 2025

సామాజిక ఉద్దేశంతో ఆయోజించిన బ్యూటీ పేజెంట్

- Advertisement -
- Advertisement -

విండో ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు నిర్వహిస్తున్న మిస్ అండ్ మిసెస్ గోల్డెన్ ఫేస్ ఆఫ్ సౌత్ ఇండియా 2023 బ్యూటీ పజంట్ ద్వారా యాసిడ్ దాడి బాధిత మహిళలకు చర్మ దానంపై అవగాహన కల్పించేందుకు సామాజిక ప్రయోజనం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమం. ఈ సామాజిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో అక్టోబర్ 14న లెమన్ ట్రీ గచ్చిబౌలిలో ఆడిషన్స్ విజయవంతంగా జరిగాయి. చెన్నై, బెంగళూరు, కొచ్చికి సంబంధించిన ఆడిషన్స్ పూర్తయ్యాయి.

యాసిడ్ దాడి బాధితులతో కలిసి నవంబర్ మొదటి వారంలో చెన్నైలో ఫైనల్స్ జరగనుంది. ఈ గ్రాండ్ సోషల్ కాజ్ ఈవెంట్‌లో పలువురు మీడియా ప్రముఖులు, సినీ తారలు భాగస్వాములయ్యారు. కంపెనీ వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ గోపీనాథ్ రవి, శరవణన్ తమ వంతు బాధ్యతగా ఎంతో గొప్ప ఉద్ద్దేశంతో మోడల్స్ తో కలిసి వారు కూడా స్కిన్ డొనేట్ చెయ్యనున్నారు. ఇలాంటి ఒక మంచి ఆలోచనతో నిర్వహించే ఈ పోటీలు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరొకుంటూ ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు వారు చేపట్టాలని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News