చెన్నారావుపేట: మండలంలోని ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు జిల్లా బాలికా విద్యాభివృద్ధి అధికారి ఫ్లోరెన్స్‌ను ఘనంగా సన్మానించారు. జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో జెండర్, ఈక్విటీ కోఆర్డినేటర్‌గా బదిలీపై వెళ్లిన ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయురాలు కొల్లూరి ఫ్లోరెన్స్‌ను విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలో ఘనంగా సన్మానించారు. హెచ్‌ఎం జన్నపురెడ్డి ఉమారాణి అధ్యక్షతన జరిగిన వీడ్కోలు సమావేశంలో విద్యార్థులు రెడ్ కార్పెట్ పర్చి, వేదిక మీదికి పూలు చల్లుతూ ఆహ్వానించారు.
ఎనిమిదేళ్లు ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎంగా పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించటంలో రాష్ట్ర విద్యా శాఖ, ఎస్‌ఈఆర్టీ ద్వారా ఉత్తమ పాఠశాలగా ఎంపిక కావడంలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడంలో, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేలా తగిన మార్గదర్శకత్వం ఇచ్చిన ఫ్లోరెన్స్ కృషిని హెచ్‌ఎం ఉమారాణి కొనియాడారు. జిల్లా బాలికా విద్యాభివృద్ధి అధికారిగా బాలికల విద్య కొరకు పాటుపడాలని ఎస్‌ఎంసీ ఛైర్మన్ కాసాని రవి కోరారు. ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ మాట్లాడుతూ.. ఉప్పరపల్లి పాఠశాలను రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దడంలో సహకరించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
బాలిక విద్యాభివృద్ధి అధికారిగా జిల్లా వ్యాప్తంగా విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్‌ఎస్ ఉప్పరపల్లి ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి, ఎస్‌ఎంసీ ఛైర్మన్ కాసాని రవితోపాటు ఉపాధ్యాయులు రమణారావు, శ్రీనివాస్, సంతోష్‌కుమార్, పిన్నింటి బాలాజీరావు, ఉదయ్‌కుమార్, సీహెచ్ మాధవి, మమత, రవికుమార్, సుందర్, మాధవి, మురళి, రవీందర్, మోహన్‌రావు, కృష్ణ, జూనియర్ అసిస్టెంటు ఎండీ జాహెద్, క్రాఫ్ట్ టీచర్ చింతకింది ఇందిర పాల్గొన్నారు.