Friday, December 20, 2024

ఎంఎల్‌ఆర్‌ఐటిలో నిఖత్ జరీన్‌కు ఘన సత్కారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన తొలి దక్షిణాది బాక్చర్, తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్‌ను ఎంఎల్‌ఆర్‌ఐటి విద్యా సంస్థ్లల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ కళాశాలలో ఎంబిఎ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నిఖత్ మంగళవారం కళాశాలకు విచ్చేయగా సహచర విద్యార్థులందరూ ఆమెకు చప్పట్లతో ఆహ్వానం పలికారు.

అనంతరం బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంలో యువ షట్లర్లు నిఖత్‌కు గాడ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. ఈ సందర్భంగా నిఖత్‌ను చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, మర్రి మమతా రెడ్డి అభినందించి ఘనంగా సన్మానించారు. అనంతరం నిఖత్ మాట్లాడుతూ తాను ఈ కళాశాలలో ఎంబిఎ చదవడానికి ప్రధాన కారణం ఇక్కడి స్పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరేనని చెప్పారు. విద్యార్థులు, వర్ధమాన ప్లేయర్లు ఇక్కడి సదుపాయాలను ఉపయోగించుకొని మంచి క్రీడాకారులుగా ఎదగాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, జాతీయ బ్యాడ్మింటన్ మాజీ చీఫ్ కోచ్ భాస్కర్ బాబు, ఇతర అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

Nikhat 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News