Wednesday, January 22, 2025

కోర్టులో ఉద్ధవ్ థాకరేకు ఘన విజయం

- Advertisement -
- Advertisement -

 

Uddhav Thackrey

ముంబై: ముంబైలోని ప్రముఖ శివాజీ పార్క్‌లో దసరా ర్యాలీ నిర్వహించేందుకు ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనకు బొంబాయి హైకోర్టు అనుమతి ఇవ్వడంతో,  శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే వర్గానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి దావాపై వివాదం పరిష్కారమయ్యే వరకు పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవద్దని షిండే వర్గం చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.
ముంబై పోలీసులు లేవనెత్తిన శాంతిభద్రతల ఆందోళనల ఆధారంగా ప్రముఖ శివాజీ పార్క్ వద్ద దసరా ర్యాలీ నిర్వహించేందుకు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనతో పాటు ఏక్నాథ్ షిండే వర్గానికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బిఎంసి) గతంలో అనుమతి నిరాకరించింది.బిఎంసి నిర్ణయాన్ని థాకరే వర్గం సవాలు చేసింది, దీనికి షిండే వర్గం జోక్యం అభ్యర్థన చేసింది.

బిఎంసి ఆర్డర్ “చట్ట ప్రక్రియ యొక్క స్పష్టమైన దుర్వినియోగం, విశ్వసనీయమైనది”(clear abuse of the process of law and bonafide) అని కోర్టు పేర్కొంది. షిండే వర్గానికి చెందిన దాదర్ ఎమ్మెల్యే సదా సర్వాంకర్, ప్రస్తుత పిటిషన్‌లో పిటిషనర్లు (ఠాక్రే నేతృత్వంలోని శివసేన) పార్టీపై దావా వేయడానికి ప్రయత్నిస్తున్నారని వాదించారు.

థాకరే నేతృత్వంలోని శివసేన ఈ నిర్ణయాన్ని స్వాగతించింది, న్యాయవ్యవస్థపై తమకున్న విశ్వాసం నిరూపితమైందని పేర్కొంది. ఈ ఏడాది ర్యాలీ గ్రాండ్‌గా ఉంటుందని పార్టీ అధికార ప్రతినిధి మనీషా కయాండే తెలిపారు. ‘‘న్యాయవ్యవస్థపై మా విశ్వాసం నిరూపితమైంది.  చాలా సంవత్సరాలుగా, దసరా ర్యాలీ ‘శివతీర్థం’ వద్ద జరుగుతోంది (సేన శివాజీ పార్క్‌ను ఉద్దేశించి), అయితే ఈసారి షిండే వర్గం, బిజెపి ద్వారా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం జరిగింది. అయితే కోర్టు దానిని తిరస్కరించింది” అని సేన కార్యదర్శి వినాయక్ రౌత్ అన్నారు.

శివసేన 1966 నుండి ప్రతి సంవత్సరం దసరా రోజున ర్యాలీని నిర్వహిస్తోంది. ఇప్పుడు సేన రెండు వర్గాలుగా చీలిపోయింది ,కోవిడ్-19 మహమ్మారి కారణంగా… 2020,  2021ల్లో ర్యాలీని నిర్వహించలేదు కనుక ఈ సంవత్సరం ఈవెంట్ ముఖ్యమైనది కాగలదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News