Monday, January 20, 2025

2023లో 15 అంగుళాల పెద్ద మ్యాక్‌బుక్ ఎయిర్ వస్తుందా?

- Advertisement -
- Advertisement -

Apple 15" MAC BOOK

 

న్యూఢిల్లీ: విశ్లేషకుల నివేదికల ప్రకారం, 15 అంగుళాల మ్యాక్‌బుక్ 2023 త్రైమాసికం నాటికి భారీగా ఉత్పత్తి కానుంది. ఆపిల్ తయారీ మ్యాక్‌బుక్ ఎయిర్ ఈ సంవత్సరం డిజైన్ చేయాల్సి ఉంది. అయితే 15 అంగుళాల వెర్షన్ 2023 నాటకి రాగలదని తెలుస్తోంది. టిఎఫ్‌ఐ సెక్యూరిటీస్‌కు చెందిన ఆపిల్ విశ్లేషకుడు మింగ్ చికుయో ప్రకారం 15 అంగుళాల మ్యాక్‌బుక్ 2023 నాల్గవ త్రైమాసికంలో భారీగా ఉత్పత్తి కానుంది. ఇప్పుడున్న మ్యాక్‌బుక్ ఎయిర్‌వలే అదే 30డబ్లు పవర్ అడాప్టర్‌ను కలిగి ఉంటుంది. అయితే ఆపిల్ భవిష్యత్ ల్యాప్‌టాప్‌కు మ్యాక్‌బుక్ ఎయిర్ అన్న పేరు పెట్టకపోవచ్చని కుయో తెలిపారు. మ్యాక్‌బుక్ ఎయిర్ కొత్త వేరియంట్ 15 అంగుళాల స్క్రీన్‌తో వస్తుందని డిఎస్‌సిసి విశ్లేషకుడు రాస్ యంగ్ తెలిపారు. మ్యాక్‌బుక్ ఎయిర్ 2020 తర్వాత ఎం1 ప్రాసెసర్ పరిచయం చేశాక, డిజైన్ రిఫ్రెష్ పొందాక అప్‌గ్రేడ్ చేయవలసి ఉంది. బ్లూమ్‌బెర్గ్‌కు చెందిన మార్క్ గుర్మాన్ ప్రకారం ఆపిల్ ఈ సంవత్సరం మ్యాక్‌బుక్ ఎయిర్‌ను పునరుద్ధరించి ఆవిష్కరించాలనుకుంటోంది. అయితే ఇది 15 అంగుళాల వెర్షన్ మాత్రం కాదు. ఇది 2022 ద్వితీయార్థంలో ఆవిష్కరించబడొచ్చని గుర్మాన్ తన వార్తాలేఖ(న్యూస్‌లెటర్)లో సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News