కుత్బుల్లాపూర్: దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ రైతు సహకార సంగం వద్ద జరిగిన రైతు దినోత్సవ వేడుకల్లో మున్సిపాలిటీ కమిషనర్‌కు చేదు అనుభవం ఎదురైంది. దశాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వం ఇప్పటికే ప్రతి రోజు చేయవలసిన మేనిఫెస్టో విడుదల చేసింది. అందులో అధికారులకు, ప్రజా ప్రదినిధులకు కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే ఇక్కడ జరిగిన ఉత్సవాల్లో మాత్రం ఏకంగా మున్సిపాలిటీ కమిషనర్‌ను ఇక్కడున్న నేతలు మాత్రం పట్టించుకోలేదు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కోపరేటివ్ చైర్మన్ లు, మేయర్, మున్సిపాలిటీ చైర్మన్‌లు, కౌన్సిలర్లు, నాయకులు, మాజీ సర్పంచ్‌లు, తహసీల్లార్లు అందరూ వేదిక మీద కూర్చున్నారు.
అక్కడ మాత్రం స్థానిక మున్సిపల్ కమిషనర్ కల్వకుంట్ల సత్యనారాయణను మాత్రం వేదిక మీదకు పిలవకపోవటంతో అతను సామాన్యుడులాగే రైతుల మధ్యలో కుర్చీని సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం చివరలో కమిషనర్‌ను గమనించిన కొందరు నేతలు ఎట్టకేలకు వేదికమీదకు ఆహ్వానించటం స్థానికంగా చర్చనియంసంగా మారింది.