Monday, January 20, 2025

ప్రాణాలు తీసిన పడవ ప్రయాణం

- Advertisement -
- Advertisement -

14మంది చిన్నారులు సహా ఇద్దరు టీచర్ల దుర్మరణం

గుజరాత్‌లోని వడోదరలో ఘటన

వడోదరా: గుజరాత్‌లోని వడోదరాలో విహారయాత్రలో విషాదం చో టుచేసుకుంది. వడోదరాలోని హరిణి లేక్‌లో గురువారం విద్యార్థుల బృందంతో వెళ్లుతున్న పడవ మునిగిపోవడంతో మొత్తం 16 మంది దుర్మరణం చెందారు. మృతులలో 14మంది చిన్నారి విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ఉన్నారు. బోటు ఆటుపోట్లకు గురైన దశలో ఇందులోని వారు భయంతో వణికిపోవడం ప్రమాదానికి దారితీసిందని వెల్లడైంది. ప్రైవేట్ స్కూలుకు చెందిన 27 మంది విద్యార్థులతో పడవ ప్రయాణం సాగుతున్నప్పుడే ఘటన జరిగింది. కొందరు ఏదో విధంగా సరస్సు నుంచి బయటపడ్డారు. షికారు దశలో విద్యార్థులు ఎవరూ కూడా లైఫ్ జాకెట్లు ఇతరత్రా ఏర్పాట్లతో లేరని వెల్లడైంది. పడవ ప్రమాదం గురించి తెలియగానే సహాయక బృందాలు తరలివచ్చాయి. విద్యార్థుల జాడకు దిగాయి. ఘటనపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు చొప్పున, గాయపడ్డ వారికి రూ. 50వేల వంతున సాయం అందించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఓ ప్రకటనలో తమ సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమాలను రద్దు చేసుకుని వడోదరాకు వెళ్లుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ 4 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు ప్రకటించారు. సహాయక చర్యలు చేపట్టినట్లు, గాయపడ్డ వారికి మెరుగైన సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. వడోదరా ఎమ్మెల్యే శైలేష్ మెహతా మాట్లాడుతూ బోటు కాంట్రాక్టరు నిర్లక్షం , బాధ్యతారాహిత్యం వల్లనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. పడవ సామర్థానికి మించి ఎక్కువ మందిని తీసుకోవడం, డబ్బుల కోసం నిబంధనలు పట్టించుకోకపోవ డం వల్లనే ఈ ఘటన జరిగిందని తెలిపారు. విషాద ఘటనకు బాధ్యులపై చర్యలకు తాము ప్రభుత్వానికి లేఖ రాస్తామని వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News