Friday, December 27, 2024

మృత్యువులోనూ వీడని బంధం

- Advertisement -
- Advertisement -

పురుగుల మందు తాగి భార్య, రోడ్డు ప్రమాదంలో భర్త ఒకే రోజులో మృతి
అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలు
లక్షెట్టిపేట : భార్య పురుగుల మందు తాగి మృతి చెందగా అదే రోజు రాత్రి భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ఎస్ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం… ఎల్లారం గ్రామానికి చెందిన రేఖేందర్ శరణ్య (28), మల్లిఖార్జున్ (35) భార్యాభర్తలు. వీరికి కుమారుడు ఓంకార్ (7), కూతురు ఇవాంక (5) ఉన్నారు.

ఇదిలా ఉండగా శరణ్యకు ఇంటి పక్కనే ఉన్న రజినితో గొడవ జరగటంతో ఇరుగు పొరుగు వారు వచ్చి ఇద్దరిని ఆపి పంపించారు. ఆ తర్వాత రజని ఇంటి పక్కన ఉన్న రేఖేందర్ రాణి అనే మహిళ రజినితో లక్షెట్టిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించింది. దీంతో మనస్తాపం చెందిన శరణ్య ఇంటి వద్ద పురుగుల మందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు శరణ్యను లక్షెట్టిపేట ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందింది.

మృతురాలి భర్త మల్లిఖార్జున్ ఫిర్యాదు మేరకు శరణ్య మరణానికి కారణమైన వావిలాల రజని, రేఖేందర్ రాణిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా కరీంనగర్‌లో చనిపోయిన శరణ్య మృతదేహాన్ని ఆమె భర్త మల్లిఖార్జున్, తన తండ్రి బంధువులతో ఆంబులెన్స్‌లో లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి వెనకాల బైక్‌పై తన తోడల్లుడితో బయల్దేరాడు.

కాగా కరీంనగర్ చౌరస్తాలో మల్లిఖార్జున్ బైక్ ఆపి టాయిలెట్ కోసం రోడ్డు దాటుతుండగా అర్థరాత్రి సుమారు 1గంటల సమయంలో కరీంనగర్ చౌరస్తా వద్ద రాయపట్నం నుంచి లక్షెట్టిపేట వైపు వస్తున్న లారీ డ్రైవర్ తన లారీని అతి వేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ మల్లిఖార్జున్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. అయితే ఒకే రోజులో తల్లిదండ్రులు మృతి చెందటంతో కుమారుడు, కూతురు ఒంటరివారు అయ్యారు. మృతుని తండ్రి రేఖేందర్ మధుసూదన్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News