Monday, January 20, 2025

దేశీయ ఎలక్ట్రిక్ వాహనాలకు ఊతం

- Advertisement -
- Advertisement -

కొత్త ఇవి పాలసీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం

విదేశీ కంపెనీలకు కనీస పెట్టుబడి రూ. 4,150 కోట్లు

టెస్లా వంటి కంపెనీల ఎంట్రీకి లైన్‌క్లియర్
టాటా, మహీంద్రాలపై ప్రతికూల ప్రభావం

న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ వాహనాల(ఇవి)కు తయారీ గమ్యస్థానంగా భారత్‌ను ప్రోత్సహించేందుకు గాను కొత్త ఇవి పాలసీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పాలసీతో అమెరికన్ ఇవి దిగ్గజం టెస్లాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఇవి వాహనాల సంస్థలకు భారత్‌లో ఎంట్రీకి లైన్ క్లియర్ కానుంది. కొత్త ఇవి విధానంలో భారతదేశానికి విదేశీ పెట్టుబడులను తీసుకురావడంపై అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాకుండా ఇవి టెక్నాలజీ ఉత్పత్తిలో భారతదేశాన్ని అగ్రగామిగా మార్చడానికి కూడా ప్రయత్నాలు చేశారు.
టాటా, మహీంద్రాలకు షాక్
ఈ కొత్త ఇవి విధానం టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలకు ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ దేశీయ దిగ్గజాలు ఇవి దిగుమతులపై పన్ను మినహాయింపును వ్యతిరేకిస్తున్నాయి. పన్నుల తగ్గింపు గ్లోబల్ కంపెనీలకు భారతదేశంలో ఖరీదైన ఇవి కార్లను విక్రయించడాన్ని సులభతరం చేస్తుందని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. 40 వేల డాలర్ల కంటే తక్కువ ధర ఉన్న కార్లపై కస్టమ్స్ డ్యూటీలో 70 శాతం మినహాయింపు ఇవ్వాలని, 40 వేల డాలర్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఇవి కార్లపై కస్టమ్స్ డ్యూటీలో 100 శాతం మినహాయింపు ఇవ్వాలని టెస్లా డిమాండ్ చేసింది. ఎవ్వరి ఒత్తిళ్లకు లోనుకాకుండా భారత్ స్వతంత్ర విధానాన్ని రూపొందిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News