Monday, December 23, 2024

మహిళా ఉపాధికి ఊతం

- Advertisement -
- Advertisement -

ఆదివారం నాడు సిద్దిపేట జిల్లాకేంద్రంలో ఓ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 140మందికి ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. జనగామ నియోజకవర్గ పరిధిలోని నాలుగు కేంద్రాలకు గ్రామానికి 35మంది చొప్పున వీటిని అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్‌రావు, జనగామ ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాజరయ్యారు.
లబ్ధిదారుల్లో అత్యధికులు పేద, దళిత మహిళలేనని మంత్రి హరీశ్ అన్నారు. ఇకనుంచి ఎవరి కాళ్లపై వారు నిలబడి ఆర్థికంగా బలోపేతం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో సావిత్రిభాయి మహిళా సంక్షేమ సంఘం చైర్మన్ మాధవి, ఎంఎల్‌సి ఫారూఖ్ హుస్సేన్, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
– మన తెలంగాణ/సిద్దిపేట

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News