Monday, December 23, 2024

యాపిల్ వాటర్ బాటిల్ ఇండియాకొస్తే రూ 5000

- Advertisement -
- Advertisement -

A bottle of apple water costs Rs 5,000 in India

న్యూయార్క్ : ప్రామాణిక , నాణ్యతాయుత మంచినీరు మనిషికి అత్యవసరం. ఈ జీవన సూత్రాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రఖ్యాత వినియోగదారుల ఎలక్ట్రానిక యాపిల్ ఇప్పుడు ఓ విశిష్టమైన వాటర్ బాటిల్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. అయితే ఈ వాటర్ బాటిల్ ధర ఇండియాలో అయితే దాదాపు రూ 5000 వరకూ పలుకుతుంది. మీ జీవన ప్రక్రియ ఏమిటీ? మీ శారీరక వ్యాయామ స్థాయి ఏమిటీ? ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ వాటర్ బాటిల్ ద్వారా మీరు ఎంత మేరకు నీరు తీసుకోవచ్చు, ఎప్పుడెప్పుడు నీరు తీసకోవాలనే అంశాలను రికార్డుగా తెలియచేస్తుంది. వీటిని యాపిల్ స్మార్ట్ వాటర్ బాటిల్స్‌గా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

యాపిల్ ఆధ్వర్యపు హైడ్రేట్ స్పార్క్ రెండు విధాలైన బాటిల్స్‌ను ప్రో, ప్రో స్టీల్ రూపాలలో తీసుకువస్తోంది. ఇందులో మొదటిది ధర 59.55 డాలర్లు ( అంటే రూ 4594), ఇక రెండోది కొంచెం ఎక్కువగా అంటే 79.95 డాలర్లుగా (అంటే దాదాపు రూ 6126గా ) ఉంటుంది. అన్నింటికంటే ప్రధానమైనదిగా ఈ యాపిల్ బాటిల్‌లో ఇమిడి ఉండే యాపిల్ ఆరోగ్య సూత్రీకరణ దిశలో ఇందులోని నీరు అత్యంత ప్రామాణికం అయ్యి , శరీరంలో ఏ స్థాయి నీరు అవసరం అనేది గ్రహించుకుని తీసుకునేలా చేస్తుంది. అయితే ఇప్పటికైతే ఈ స్మార్ట్‌వాటర్ బాటిల్ ఇండియాలో మార్కెట్‌లోకి రాలేదు. అయితే అమెరికాలో దీని పట్ల విశేష స్పందన వెలువడింది. మంచినీరు మరింత మంచిగా ఉండేది ఆరోగ్యవంతం అయినది తీసుకోవాలనుకునే జనం ఆలోచనల ప్రాతిపదికన ఇండియాలోనూ ఈ స్మార్ట్ బాటిల్స్ వస్తే విశేష గిరాకీ ఉంటుందని కంపెనీ వర్గాలు ఆశిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News