Friday, December 27, 2024

చందానగర్‌లో విషాదం.. ప్రమాదవశాత్తు మస్కిటో లిక్విడ్ తాగిన బాలుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నాకూడా ఏ వైపు నుంచి ఏ ఆపద ముంచుకొస్తుందో ఊహించలేము. పిల్లలు ఎదిగేంత వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాద్యత వారిదే. తాజాగా చందానగర్‌లో ప్రమాదవశాత్తు దోమలను తరిమికొట్టె మస్కిటో లిక్విడ్ తాగి ఏడాదిన్నర బాలుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చందానగర్ పోలీస్ పరిధి తారానగర్‌కు చెందిన జుబేర్ కొడుకు అబ్బు జాకీర్ ఆడుకుంటూ అనుకోకుండా ఆల్ అవుట్ లిక్విడ్ తాగాడు. బాలుడి బట్టలపై ఆల్ అవుట్ లిక్విడ్ వాసన రావడంతో అనుమానం వచ్చి హాస్పిటల్‌కు తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. కానీ అప్పటికే పరిస్థితి విషమంగా మారింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబంలో విశాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News